అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌లకే అవినీతి కేసులో టీవీ5 రవీంద్ర‌నాథ్ Just within 3 months after winning in Jubilee Hills Society Elections Tv5 Bollineni Ravindranath caught in corruption case

కోట్లాది రూపాయ‌ల భూమిని త‌క్కువ ధ‌ర‌కు అమ్మి డ‌బ్బు చేసుకున్నారని టీవీ5 రవీంద్ర‌నాథ్ మీద కేసు న‌మోదైంది.

ఎలాంటి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించ‌కుండానే, ఎవ‌రికీ అనుమానం కూడా రాకుండా, గుట్టు చ‌ప్పుడు కాకుండా 350 గ‌జాల స్థ‌లాన్ని పార్వ‌తి దేవి అనే మ‌హిళ‌కు, ర‌వీంద్ర నాథ్ అమ్మాడ‌ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ర‌వీంద్ర నాథ్ పైన సురేష్ బాబు అనే వ్య‌క్తి కంప్లైంట్ చేశాడు. కోట్లాది రూపాయ‌ల స్థలాన్ని కేవలం గ‌జం 45 వేల రూపాయ‌ల‌కు అమ్మి, ఆ డబ్బును జేబులో వేసుకున్నాడ‌ని సురేష్ బాబు కేసు ఫిర్యాదు చేశారు.


ఈ అమ్మ‌కం ద్వారా సొసైటీకి త‌క్కువ‌లో త‌క్కువ అనుకున్నా స‌రే 5 కోట్ల మేర న‌ష్టం జ‌రిగింద‌ని ఆయ‌న పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. సురేష్ బాబు ఫిర్యాదు మేర‌కు పోలీసులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్య‌క్షుడు ర‌వీంద్ర నాయుడుతో పాటు, ట్రెజ‌ర‌ర్ నాగ‌రాజు పై కూడా కేసు న‌మోదు చేసి, పూర్తి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.


ఈ కేసు న‌మోదైన వెంట‌నే మ‌రో వివాదం కూడా తెర‌పైకి వ‌చ్చింది. త‌మ స్థ‌లం క‌బ్జాకు గురైందంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఆ స్థ‌లం జీహెచ్ఎంసీ కు సంబంధించింద‌ని అందులో నిర్మించిన క‌ట్ట‌డాల‌ను కూడా అధికారులు కూల్చివేశారు. మొత్తానికి సుప‌రిపాల‌న అందిస్తామ‌ని చెప్పిన టీవీ5 రవీంద్ర‌నాథ్ అధికారంలోకి వ‌చ్చి మూడు నెల‌లైనా కాక‌ముందే ఆయ‌న‌కు అల‌వాటైన రీతిలో అక్ర‌మాలకు తెర లేపార‌ని సొసైటీ స‌భ్యులు వాపోతున్నారు.

4.7 Star App Store Review!
Cpl.dev***uke
The Communities are great you rarely see anyone get in to an argument :)
king***ing
Love Love LOVE
Download

Select Collections